రాజమహేంద్రవరం రూరల్: జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం ఆధ్వర్యాన గణితోత్సవం నిర్వహిస్తున్నారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ, ఆర్గనైజర్ మేకా సుసత్యరేఖ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి గణిత ఉపాధ్యాయులు, మేధావులు, గణిత అవధానులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. రంగోలీ పోటీలు, క్విజ్, పేపర్ ప్రజెంటేషన్, గణిత పాటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గణిత విషయ నిపుణుడు కేవీవీ సత్యనారాయణ ప్రత్యేక ఉపన్యాసం చేస్తారన్నారు. శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర చిత్ర రూపంలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. అలాగే గణిత బోధనోపకరణాలపై ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కాకినాడ జోన్–2 సంయుక్త సంచాలకులు నాగమణి, డిప్యూటీ డైరెక్టర్ ఎస్.అబ్రహం, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి వాసుదేవరావు, కాకినాడ, కోనసీమ డీఈఓలు రమేష్, షేక్ సలీం బాషా, సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ గుర్రయ్య తదితరులు పాల్గొంటారని వివరించారు.
0000626756-000001-TPT ADSALES SPO
5.00x8.00
TPT ADSALES SPOT PAYMENT ACCOUNT
Comments
Please login to add a commentAdd a comment