రాజానగరం: ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు విద్యా పునాదులు బాగున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పరిశీలకుడు ఆర్.రంగయ్య అన్నారు. కొండగుంటూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆరు రోజులుగా జరుగుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ ఐదో బ్యాచ్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జయశ్రీ మాట్లాడుతూ పొందిన శిక్షణను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయాలని అన్నారు. కోర్సు కో ఆర్డినేటర్ పి.రాంబాబు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు భాష, గణితంలో బలమైన పునాదులు ఏర్పరిచేందుకు ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణ ఇచ్చామన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 277 మంది ఉపాధ్యాయులు ఈ బ్యాచ్‌లో శిక్షణ పొందారని తెలిపారు. ఆరో బ్యాచ్ శిక్షణ ఈ నెల 26 నుంచి 31 వరకూ జరుగుతుందన్నారు. శిక్షణలో బోధనోపకరణాలను తయారు చేసి, ప్రదర్శించడంలో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ఉత్తమ టీఎల్‌ఎం మేకర్స్ అవార్డులు అందించారు. అలాగే విభిన్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment