10వ తేదీకి సంవృద్ధిగా యూరియా
జిల్లా వ్యవసాయ శాఖాధికారి మాధవరావు
కొవ్వూరు: ఈ నెల పదో తేదీలోపు 2,500 టన్నుల యూరియాను, 300 టన్నుల డీఏపీని అందుబాటులో ఉంచుతామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా యూరియాకి కొరత ఏర్పడిన నేపథ్యంలో యూరియా.. ఏదయా! శీర్షికన సోమవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. తాళ్లపూడి మండలం మలకపల్లి ఎల్‌ఏసీఎస్‌లో ఎరువుల నిల్వలు, అమ్మకాలను ఆయన పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆర్డీవో రాణి సుస్మిత మలకపల్లి వెళ్లి యూరియా అమ్మకాలపై ఆరా తీశారు. జనవరి నెలాఖరు లోపు మిగిలిన అన్నీ రకాల ఎరువులను అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి గంగాధరరావు మాట్లాడుతూ పశివేదల, వాడపల్లి, దొమ్మేరు పీఎసీఎస్‌లకు సోమవారం యూరియా స్టాకు వచ్చిందన్నారు. జిల్లాకి ఆదివారం 600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిం దని, దీన్ని సోమవారం పలు సోసైటీలకు సర్దుబాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment