జిల్లాలో రూ.125 కోట్ల సీ్త్రనిధి రుణాలు
పెరవలి: జిల్లాలో సీ్త్రనిధి ద్వారా 22 వేల మందికి రూ.125 కోట్ల మేర రుణాలు అందించామని ఏజీఎం ఎం.ధర్మేంద్ర తెలిపారు. పెరవలి వెలుగు కార్యాలయానికి మంగళవారం వచ్చిన ఆయన సీ్త్రనిధి రుణాలు, వసూళ్లపై రికార్డులు పరిశీలించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీ్త్రనిధి రుణాలు తీసుకున్న డ్వాక్రా గ్రూపులు జిల్లాలో 33 వేలు ఉన్నాయన్నారు. వీటిలో రుణాలు తీసుకున్న సభ్యులు 22 వేల మంది ఉన్నారని చెప్పారు. సీ్త్రనిధి రుణాల చెల్లింపు 99 శాతంగా ఉందన్నారు. స్తీనిధి రుణాలు సక్రమంగా చెల్లిస్తున్న సభ్యులకు రుణ పరిమితి పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఒక్కో సభ్యురాలు రూ.5 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చని, దీనిని 23 వాయిదాల్లో సక్రమంగా చెల్లిస్తే కేవలం 11 శాతం వడ్డీ పడుతుందని వివరించారు. అంతే కాకుండా బ్యాంక్ లింకేజీ ద్వారా మరో రూ.2 లక్షల రుణం పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసుకుంటే మరో రూ.10 లక్షల రుణం కూడా లభిస్తుందని చెప్పారు. పెరవలి మండలంలో 1,333 మంది సభ్యులు రూ.7.78 లక్షల మేర సీ్త్రనిధి రుణాలు తీసుకున్నారని, అందరూ సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారని ధర్మేంద్ర తెలిపారు. కార్యక్రమంలో సీ్త్రనిధి జిల్లా మేనేజర్ ఎం.రత్నకుమారి, ఏపీఎం బి.రామకృష్ణ, సీసీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
డైట్‌లో జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో విద్యార్థులకు ఎనిమిది అంశాల్లో మంగళవారం రంగోత్సవ్ పోటీలు నిర్వహించారు. క్విజ్‌లో బి.అక్షయ దీపిక (శాటిలైట్ సిటీ జెడ్పీ హైస్కూల్), చిత్రలేఖనంలో జి.సాయి వేదస్వి (కాతేరు తిరుమల పాఠశాల), హ్యాండ్ రైటింగ్ పోటీలో ఎం.తనిష్క (శ్రీ గౌతమి పాఠశాల), రంగోలీ పోటీల్లో కె.సాయిసుధ, కె.సంజన, వి.దుర్గ టీమ్ (కాకినాడ సాలిపేట మున్సిపల్ ఉన్నత పాఠశాల), జానపద నృత్యంలో కె.హిమవర్షి (రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ కేంద్రీయ విద్యాలయం), డిజిటల్ కొలేజ్ విభాగంలో ఎన్.యోగి సత్య ప్రియాంక (కడియం జెడ్పీ హైస్కూల్), స్లోగన్స్ విభాగంలో జి.లలిత (శాటిలైట్ సిటీ జెడ్పీ హైస్కూల్) ప్రథమ స్థానాలు సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని డైట్ ప్రిన్సి పాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ వివరించారు. ప్రథ మ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన అందరికీ సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా జోగన్నశాస్త్రి, రాజు, సూర్యనారాయణ, జానకీదేవి, చూడామ ణి, గంగాధర్, రాజేష్, భవానీ వ్యవహరించారు.
డిమాండ్ల సాధనకు దశల వారీ ఉద్యమం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ సొసైటీ యూనియన్ ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం నుంచి దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు టి.వెంకట రామయ్య, ట్రెజరర్ పి.సత్యనారాయణ మంగళవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. బుధవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 9న పార్లర్ రన్‌తోపాటు అన్ని కంప్యూటర్ పనులు నిలుపు చేస్తామని, 10న డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని వివరించారు. ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 27న విజయవాడలోని రాష్ట్ర సహకార బ్యాంకు వద్ద మహా ధర్నా చేపడతామన్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేయనున్నామని చెప్పారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు, వేతన సవరణ, రెగ్యులర్ చేయడం, చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు, ఆడిట్ డ్యుయల్ పద్ధతి రద్దు, సహకార సంఘాలకు ఆదాయ పన్ను మినహాయింపు, షేర్ ధనంపై డివిడెండ్ చెల్లింపు, షేరు ధనంలో సంఘాలకు వాటా కల్పించడం వంటి డిమాండ్లతో పాటు సహకార రంగాన్ని ప్రైవేటు పరం చేయవద్దని కోరుతూ ఈ ఆందోళనలు చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment