కళ్లప్పగించేలా.. ఒళ్లు జలదరించేలా..
కాజులూరు: సంక్రాంతి సమీపిస్తోందంటే గ్రామాల్లో కోడిపుంజులు పందేలకు కాలుదువ్వుతుంటాయి. కోర్టులు వద్దని చెబుతున్నా, పోలీసులు దాడులుచేసి కేసులు పెడతామని బెదిరిస్తున్నా ఏదో ఒక పక్క పందేలు వేసేవారు వేస్తుంటారు. వాటిని చూడటానికి వెళ్లేవారు వెళుతుంటారు. అయితే కాజులూరు మండలం గొల్లపాలెంలో సోమవారం రెండు ఆబోతులు భీకరంగా తలపడగా స్థానికులు కళ్లప్పగించి తిలకించారు. కాకినాడ, కోటిపల్లి రహదారిపై పోటీకి దిగిన ఆబోతులు సుమారు అర్ధగంటసేపు ఆగకుండా పోట్లాడుకోవడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కర్రలతో బెదిరించినప్పటికీ అవి పట్టు వీడలేదు. రహదారిపై ఇరువైపులా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొమ్ముల నుంచి రక్తం కారటంతో స్థానికులు బకెట్లతో ఎద్దులపై నీళ్లు చల్లి వాటిని శాంతింపజేశారు.
గొల్లపాలెంలో భీకరంగా పోట్లాడుకుంటున్న ఆబోతులు
ఆబోతుల భీకరపోరు
స్థానికుల బెంబేలు
Comments
Please login to add a commentAdd a comment