కొవ్వూరు: మోటారు సైకిల్ పై పొలం వెళుతున్న తండ్రీకొడుకులను కొట్టడమేకాక, చంపుతానని బెదిరించినట్లు అందిన ఫిర్యాదుపై సీతంపేట గ్రామానికి చెందిన కొందరిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. సీతంపేటకు చెందిన సంగీతం చిన్నరాజు, తన కుమారుడు కిరణ్ విఘ్నేష్ మోటారు సైకిల్‌పై పొలం బయల్దేరారు. మార్గమధ్యలో గొడవ పడుతున్న వ్యక్తులను చిన్నరాజు వారించారు. దీంతో మచ్చా వెంకటరమణ, అల్లం సంజు, కొత్తపల్లి ప్రసన్నకుమార్‌తో పాటు మరికొంత మంది మోటారుసైకిల్‌ను అడ్డుకుని తిరగబడి చిన్నరాజును పిడిగుద్దులు గుద్ది చంపుతానని బెదిరించారు. ప్రశ్నించినందుకు కిరణ్ విఘ్నేష్‌ను సైతం కొట్టి దుర్భాషలాడి చంపుతానని బెదిరించారు. వెంకటరమణ అనే వ్యక్తి చిన్నరాజుపై బీరు బాటిల్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. చిన్నరాజు కుమారుడు కామేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీహరిరావు తెలిపారు. తన తండ్రి చిన్నరాజు, తమ్ముడు కిరణ్ విఘ్నేష్ ప్రస్తుతం నిడదవోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment