అన్నవరం కొండపై మహిళ ఆత్మహత్యాయత్నం
అన్నవరం: కుటుంబ కలహాల కారణంగా కాకినాడకు చెందిన ఒక మహిళ అన్నవరంలో ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళ ఆచూకీ తెలుసుకుని ఆమెను బంధువులకు అప్పగించారు. బుధవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన తోలం లక్ష్మి కుటుంబ కలహాల కారణంగా మంగళవారం సాయంత్రం అన్నవరం కొండ మీదకు ఆత్మహత్య చేసుకొనేందుకు వచ్చింది. విజయవాడ డీజీపీ కార్యాలయం నుంచి 112 నంబర్ కాల్ ద్వారా కాకినాడ ఎస్‌పీ విక్రాంత్ పాటిల్‌కు ఈ సమాచారం రావడంతో ఆయన స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు అన్నవరం కొండపై గాలించి 40 నిమిషాల వ్యవధిలోనే ఆ మహిళ ఆచూకీ కనుగొని ఆమె కు కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులను పిలిపించి వారికి ఆమెను అప్పగించినట్లు అన్నవరం ఎస్‌ఐ శ్రీహరి బాబు తెలిపారు.
కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment