వాలీబాల్ విజేత నడకుదురు
తాళ్లరేవు: సంక్రాంతి సంబరాల్లో భాగంగా తాళ్లరేవులో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా గల స్థలంలో నాకౌట్ పద్ధతిలో డే అండ్ నైట్, ఫ్లడ్ లైట్ల కాంతుల్లో ఈ పోటీలను రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. 24 జట్లు తలపడగా భైరవపాలెం, నడకుదురు జట్లు ఫైనల్‌కు చేరాయి, హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో నడకుదురు జట్టు విజయం సాధించింది. కాగా గిరియాంపేట జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. విజేత జట్టుకు సుంకరపాలెం హోండా షోరూం అధినేత తోట రాజు, ముమ్మిడివరం ఏఎంసీ మాజీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ బహుమతి ప్రదానం చేశారు.
శంకరగుప్తంలో చెడుగుడు పోటీలు
మలికిపురం: మండలంలోని శంకరగుప్తం గ్రామంలో నల్లివారిపేటలో 71 సంవత్సరాలుగా జరుగుతున్న చెడుగుడి ఆటల పోటీలు సంక్రాంతి సందర్భంగా నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ కబడ్డీ పోటీలను బుధవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. విజేతలు ప్రథమ బహుమతిగా క్రాంతి బ్రదర్స్ బాయ్స్ (శంకర్‌గుప్తం) రూ.20వేలు, జ్ఞాపిక. ద్వితీయ బహుమతి పసక్ బాయ్స్ (శృంగవరప్పాడు) రూ.15 వేలు, జ్ఞాపిక. తృతీయ బహుమతి ప్లే బాయ్స్(పడమటిపాలెం) రూ.ఏడు వేలు, జ్ఞాపిక అందుకున్నారు. నైపుణ్యం చూపిన వారికి బెస్ట్ ప్లేయర్ జ్ఞాపికలను ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్ రాపాక ఆనందకుమార్ చేతుల మీదుగా అందించారు.
Comments
Please login to add a commentAdd a comment