కొత్త అల్లుడికి 270 రకాలతో విందు
మామిడికుదురు: సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడికి మెగా విందు ఏర్పాటు చేసి ఔరా అనిపించారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కుక్కుల వెంకటేశ్వరరావు. ఆయన కుమార్తె మౌనికకు మూడు నెలల క్రితం మామిడికుదురుకు చెందిన శ్రీరామ్‌తో వివాహమైంది. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడిని ఇంటికి తీసుకు వచ్చి, 270 రకాల పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. వెజ్, నాన్ వెజ్‌తో కూడిన పలు రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ విందు అబ్బురపరచింది.
39 ప్రైవేట్ బస్సులకు 1,24,575 అపరాధ రుసుం
రావులపాలెం: నింబంధనలు పాటించని 39 ప్రైవేట్ బస్సులకు రూ.1,24,575 అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి డి. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చే ప్రైవేట్ బస్సులను తెల్లవారుజామున ఈతకోట వద్ద హైవేపై ఆర్.టి.ఏ అధికారులు తనిఖీలు చేశారన్నారు. 39 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,24,575 అపరాధరుసుం వసూలు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వాహనాల తనిఖీ అధికారులు రాజేంద్రప్రసాద్, రవికుమార్, లక్ష్మీ శ్రీదేవి, కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారన్నారు.
జాతీయ రహదారిపై 120 చక్రాల బండి
రాజానగరం: జాతీయ రహదారిపై వెళ్తున్న 120 చక్రాలతో కూడిన భారీ వాహనం అందరినీ ఆకట్టుకుంది. చైన్నె నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరిన ఈ వాహనం ఒడిశాలోని డార్సెల్ ఫ్యాక్టరీకి వెళుతోంది. ఈ ప్రయాణంలో విశ్రాంతి తీసుకునే క్రమంలో వాహనాన్ని చోదకుడు దివాన్‌చెరువులో రోడ్డు పక్కన కొద్దిసేపు ఆపాడు. సుదూరం కావడం వలన ఈ వాహనంలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సహాయకులు షిప్టుల ప్రకారం డ్యూటీ చేస్తున్నారు. రోడ్డు పక్కన ఆగిన వాహనాన్ని కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో క్లిక్ మనిపిస్తే, మరికొందరు సెల్ఫీలు దిగారు.
భారీ వాహనం
Comments
Please login to add a commentAdd a comment