పరిపూర్ణానంద స్వామికి మాతృ వియోగం
కాకినాడ రూరల్: రమణయ్యపేటలోని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణ్ణానంద సరస్వతి స్వామి మాతృ వియోగం పొందారు. ఆయన మాతృమూర్తి, పూర్వస్రపు తల్లి టీజీ మీనాక్షి(80) భోగి రోజున సోమవారం పరమ పదించారు. ఈ మేరకు శ్రీపీఠం నిర్వహకులు బుధవారం తెలియజేశారు. పిఠాపురం పాదగయ వద్ద శ్మశాన వాటికలో మంగళవారం పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా అంత్య క్రియలు నిర్వహించారు. నెల్లూరులో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తుండగా మీనాక్షి రెండు కళ్లకు రెటీనా దెబ్బతినడంతో కంటి చూపు పూర్తిగా పోయింది. తల్లిదండ్రులు, తోబట్టువులు ఒత్తిడితో బాలచంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తనకు పుట్టే సంతానం సన్యాసిగా జాతికి సేవ చేయాలని ఆమె సంకల్పించుకున్నారు. 1972 నవంబర్ 1న బిడ్డ పుట్టగా గురువుల సన్నిధిలో పెంచారు. పదునాలుగున్నర ఏళ్ల వయసులో హృషికేష్‌లో గంగాతీరంలో దయానంద ఆశ్రమంలో స్వామి దయానంద వద్దకు చేర్చారు. అప్పటి నుంచి 36 ఏళ్లు ఆమె ఒక దీక్ష తీసుకుని బంగార ఆభరణాలు, వస్త్రాలంకరణ లేకుండా తన బిడ్డపైనే ఆశలు పెట్టుకుని సన్యాసిగా తీర్చిదిద్దారు. ఆయనే కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణా నంద సరస్వతి. రెండో సంకల్పంగా నిత్యం సహస్ర గాయత్రి చేస్తూ కోటి 14లక్షల గాయత్రి జపాన్ని పూర్తి చేశారు. మూడో సంకల్పంగా తన బిడ్డ చేతుల్లో తుదిశ్వాస విడిచారు. పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ 72రోజుల పాటు వైద్య అంశాలకు అతీతంగా దివ్యమైన అమ్మవారి సన్నిధిలో గడిపి భోగి నాడు తుదిశ్వాస విడిచారన్నారు. సంక్రాంతి రోజున అంత్యక్రియలు, కనుమ నాడు గోదావరిలో అస్థికల నిమజ్జనం చేశామని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment