గణతంత్ర వేడుకలకు ఎంపిక
నల్లజర్ల: ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు చీపురుగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా సీఏ తలంశెట్టి ఉషారాణి ఎంపికై ంది. కృషి సఖీ సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ పొందడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది. ఈ నెల 22వ తేదీన బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు.
వచ్చే నెల 28లోగా
లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఖజానా ద్వారా పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ ఫించనుదార్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి ఎన్.సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీతో ఆన్‌లైన్ ద్వారా కూడా దీనిని అందజేయవచ్చన్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ నెల ఒకటో తేదీకి ముందు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దగ్గర్లోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ అందించవచ్చని సత్యనారాయణ తెలిపారు.
పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు
దరఖాస్తుల ఆహ్వానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రానున్న ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రోగ్రాం ప్రారంభమైందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిదర్ రామన్, సహాయ సంచాలకుడు ప్రదీప్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.పెరుమాళ్లరావుతో కలిసి శనివారం తన చాంబర్‌లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు నైపుణ్య శిక్షణతో కూడిన విద్యను, 12 నెలలు పారిశ్రామికానుభవంతో అందించాలని సంకల్పించారన్నారు. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా 20 కంటే ఎక్కువ రంగాల్లో యువతకు అవకాశాలున్నాయన్నారు. దీనికి 21–24 ఏళ్ల మధ్య వయసు కలిగి, ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ కలిగి ఉన్న వారితో పాటు ఆన్‌లైన్, దూరవిద్య ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు 99489 95678, 73967 40041 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న వారికి 12 నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారన్నారు. ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంది సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment