No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Jan 19 2025 2:27 AM | Last Updated on Sun, Jan 19 2025 2:27 AM

No Headline

No Headline

బుజ్జి తువ్వాయి @ 19 అంగుళాలు

తల్లి గర్భాలయం నుంచి అప్పుడే ఈ లోకంలోకి వచ్చి.. లేలేత మృదువైన చర్మంపై మావి తడిని..

తల్లి నాలుకతో ఆప్యాయంగా నాకుతూంటే.. నేలపై సరిగ్గా నిలబడలేని తనను.. పడిపోకుండా పొదివి పట్టుకున్న యజమానిని అరమోడ్పు కన్నులతో కాస్తంత బెదురు చూపులు చూస్తూ.. అడుగున్నర ఎత్తుకు కాస్త అటుగా ఉన్న ఆ బుజ్జి తువ్వాయి చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. ధవళేశ్వరంలోని అగ్రహారం ప్రాంతానికి చెందిన తడాల సాయి శ్రీనివాస్‌ ఇంట ఉన్న ఆవు.. ఈ 19 అంగుళాల పుంగనూరు పెయ్య దూడకు శనివారం జన్మనిచ్చింది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన.. మూగజీవాలపై ఉన్న ప్రేమతో మూడేళ్లుగా పుంగనూరు ఆవును పెంచుతున్నాడు. దీనికి పుట్టిన

బుజ్జి ఆవు పెయ్య దూడను చుట్టుపక్కల వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ధవళేశ్వరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement