దార్శనిక నేత విద్యాప్రదాత
● ప్రపంచంతో విద్యార్థులు పోటీపడేలా ట్యాబుల పంపిణీకి శ్రీకారం
● రెండేళ్లలో 38,393 మందికి ట్యాబులు అందజేత
● విద్యాదీవెన, వసతి దీవెనలతో ఉన్నత విద్యకు తోడ్పాటు
● అమ్మ ఒడిలో ఏటా రూ.15 వేలు తల్లుల ఖాతాలో జమ
● కూటమి పాలనలో తల్లికి వందనం అంటూ ఎగనామం
క్లాస్‌రూంలో టేబుల్‌పై ట్యాబులతో విద్యాభ్యాసం..
కార్పొరేట్ స్కూళ్లలో కనిపించే ఈ విధానం సర్కారు స్కూళ్లలో అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదే.
కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా, పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా నాలుగేళ్లలో వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ విద్యా విధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పునకు నిదర్శనమిది.
శిధిలావస్థకు చేరిన పాఠశాలలకు మహర్దశ.. క్లాస్‌రూమ్‌లో సౌకర్యాలు..
ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యాదీవెన, విదేశీ విద్య..
పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం
ఇలా వైఎస్ జగన్ హయాంలో విద్యా రంగానికి పెద్దపీట వేశారు.
– సాక్షి ప్రతినిధి, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment