రామ్‌రాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో రామ్‌రాజ్ కాటన్ షోరూమ్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఏలూరు రోడ్‌లో షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్‌ను యజమాని కానూరి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు యశ్వంత్, శ్రీనివాసరావు తల్లి సత్యనారాయణమ్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తిన చిన్న, రామ్‌రాజ్ కాటన్ జీఎం శశీంద్రన్ నాయక్, కానూరి సూర్యకుమారి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా, కౌంటర్‌ను వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మండవల్లి సోంబాబు ప్రారంభించి, కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రామ్‌రాజ్ జీఎం శశీంద్రన్ నాయక్ మాట్లాడుతూ తమ వద్ద రామ్‌రాజ్ ప్రోడక్ట్స్ అనగా పట్టుపెంచెలు, కండువాలు, చీరలు, రెడీమేడ్ షర్ట్స్, ఫ్యాంట్స్, జెంట్స్ క్లాత్ ఫాంటింగ్, షర్టింగ్ అన్నీ రామ్‌రాజ్ బ్రాండ్‌లో లభిస్తాయని తెలిపారు. షోరూమ్ యజమాని కానూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మా సొంత వ్యాపారంలో అనుభవం ఉన్న ప్రావీణ్యంతో చక్కగా అందరికీ సరసమైన ధరలలో అందరికీ కావాల్సిన దుస్తులను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందరూ విచ్చేసి మాధవి క్లాత్ అండ్ రెడీమేడ్స్ షోరూమ్‌కు అందించినట్లుగానే, తమ రామ్‌రాజ్ షోరూమ్ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment