పెరుగుతున్న పెట్టుబడి
రొయ్యల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. శీతాకాలం దానికి తోడు వాయుగుండ ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోతుంది. ఏరియేటర్లు తిప్పినా ఫలితం ఉండటం లేదు.
– ఇంటి ప్రేమానందం, ఆక్వా రైతు, చినమిల్లిపాడు
రొయ్యలు మేత తినడం లేదు
ప్రస్తుత రొయ్యల సాగు తుఫాన్, వాయుగుండం ప్రభావాలకు గురై అతలాకుతలమవుతుంది. చలి గాలులతో పాటు తెలికపాటు జల్లుల వల్ల రొయ్యకు ఆక్సిజన్ అందడం లేదు. ఎదుగుదల లేక, వైరస్‌లతో సతమతమవుతున్నాం. దీంతో పెట్టుబడులు అధికమై, ధర లేక కుదేలవుతున్నాం.
– నంద్యాల సీతారామయ్య, ఆక్వా రైతు, కుప్పనపూడి
సిండికేట్‌గా వ్యాపారులు
వాతావరణం మార్పులతో రొయ్యలు రోగాలబారిన పడుతున్నాయి. ఇమ్యునిటీ తగ్గిపోయి వైరస్‌లు సోకే ప్రమాదం ఉంది. అలాగే రొయ్య ధరలు తటస్థంగా ఉండటంలేదు. వ్యాపారులు సిండికేట్‌గా తయారై ధరలు నిర్ణయిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి.
– పిల్లా నర్శింహరావు, ఆక్వా రైతు, ఆకివీడు
Comments
Please login to add a commentAdd a comment