నన్నయ యూనివర్సిటీ మహిళా వాలీబాల్ జట్టు ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరఫున అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీల్లో తలపడే జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. స్థానిక సీఆర్‌ఆర్ మహిళా కళాశాలలో గురువారం, శుక్రవారం నిర్వహించిన అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారిణులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. కాగా ఈ పోటీల్లో జంగారెడ్డిగూడేనికి చెందిన సీఎస్‌టీఎస్ ప్రభుత్వ కళాశాల జట్టు విజేతగా నిలువగా గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ జట్టు ద్వితీయ స్థానంలో, ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ జట్టు తరఫున ఆడే జట్టుకు కె.జయశ్రీ, యూఎన్‌డీ భవాని, వి.ఉషా నాగబాల, టి.రోహిణి, సీహెచ్ పల్లవి, పి.రమ్య, జి.జయశ్రీ, ఎల్.జ్యోతిలక్ష్మి, టి.శైలజ, జి.ప్రసన్న జ్యోతి, ఎం.నాగ తులసి, డి.మల్లేశ్వరి ఎంపికయ్యారు. వీరితో పాటు స్టాండ్ బై క్రీడాకారిణులుగా ఎం.లావణ్య, బి.అనిత, సీహెచ్ శోభారాణి, వి. ప్రవల్లికలను ఎంపిక చేశారు. ఈ జట్టు జనవరి 7 నుంచి 11వ తేదీవరకూ తమిళనాడులోని జెప్పియర్ యూనివర్సిటీలో నిర్వహంచే దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలో నన్నయ యూనివర్సిటీ తరఫున పాల్గొంటారు. అంతకు ముందు జరిగిన పోటీల్లో విజేతలకు సీఆర్‌ఆర్ మహిళా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్స్‌పాల్ జీ. సరళ బహుమతులు అందజేశారు.
పశువధపై చర్యలు తీసుకోవాలి
భీమవరం(ప్రకాశం చౌక్): తణుకు మండలం తేతలి గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న పశువధశాలలో ప్రతిరోజూ వందలాది పాడి పశువులను వధిస్తున్నారని రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి ఆరోపించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌కు అక్రమ పశువధశాల బాధితులతో వచ్చి అక్రమ పశువధపై చర్యలు తీసుకోవాలని అందుబాటులో ఉన్న వన్‌టౌన్ ఎస్సై కిరణ్‌కు వినతిపత్రం అందించారు. పశువధ విషయాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, కాబట్టి కలెక్టర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment