అన్నదాతకు వాయుగండం
ఆరబెట్టిన ధాన్యపు రాశులపై టార్పాలిన్ కప్పి ఉంచిన దృశ్యం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల చిరుజల్లులు పడడంతో శుక్రవారం రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. అత్తిలి మండలంలో దాదాపుగా నూరు శాతం వరికోతలు పూర్తయ్యాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు రోడ్ల వెంబడి రాశులు పోసి ఆరబెట్టగా ఆకాశం మేఘావృతం కావడంతో వాటిని పోగు చేసి టార్పాలిన్‌లు కప్పారు. తేమ శాతం ఉన్నప్పటికీ కొంతమంది రైతులు ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుందామని రైస్ మిల్లులకు తరలించారు. – అత్తిలి
Comments
Please login to add a commentAdd a comment