సామాజిక అసమానతలతో ఓబీసీలకు అన్యాయం
భీమవరం: దశాబ్దాల తరబడి దేశం గర్వపడే స్థాయిలో తమ వంతు పాత్ర పోషించినప్పటికి ఓబీసీలకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని, అధికార పాలక వర్గాలు ఓబీసీలను వెనుకబాటు తనంలోకి నెట్టివేస్తుందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విమర్శించారు. భీమవరం టౌన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఓబీసీల స్థితిగతులు మెరుగుపడాలంటే కులగణనే పరిష్కార మార్గమని, 2010లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ హోదాలో లోక సభలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని, అధికారానికి వచ్చారు కానీ ఓబీసీ జనగణన చేపడతారన్న నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని, బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంత్ రావు, జిల్లా నాయీబ్రాహ్మణ అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్, గుడాల శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వర రావు, మల్లుల కేదరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment