మామిడిలో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
నూజివీడు: ప్రస్తుతం మామిడి తోటలు పూమొగ్గ దశ, పచ్చిపూత దశ, పూత దశలో ఉన్న దృష్ట్యా ప్రస్తుత ముసుగు వాతావరణ పరిస్థితులలో రైతులు సస్యరక్షణ చర్యలను చేపట్టాలని నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి వెల్లడించారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గత రెండు, మూడు రోజులు గా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, అలాగే అల్పపీడనం వల్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు 22.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25.1 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతున్నాయన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల మామిడిలో రసం పీల్చే పురుగుల ఉధృతి, తెగుళ్ల ఉధృతి అధికమయ్యే ప్రమాదం ఉందన్నారు. మామిడి తోటలు పూమొగ్గ దశలో ఉంటే తేనె మంచు పురుగులు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ, క్లోరోథలోనిల్ 2 మిలీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment