రేపు విక్టరీ 3కే రన్
పెంటపాడు: మండలంలోని అలంపురం టీబీఆర్ జూనియర్ కళాశాల, డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం విక్టరీ 3కే రన్‌ను నిర్వహిస్తున్నట్లు సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ నాయకుడు బోగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో పోరాడిన 20 మంది యుద్ధవీరులను ఎంపిక చేసి సన్మానిస్తామని పేర్కొన్నారు. అలాగే నేషనల్‌డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడు కేటగరీల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. ప్రథమ బహుమతి సాధించిన 10 మందికి ఉచితంగా విద్య అందిస్తామని పేర్కొన్నారు. అలాగే మొదటి 50 మందికి రాయితీతో కూడిన విద్యను అందిస్తామని స్పష్టం చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భీమడోలు: కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన నాళం శివగణేష్ (28) చికిత్స పొందుతూ మృతి చెందాడని భీమడోలు హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామానికి చెందిన నాళం శివగణేష్(28) భీమడోలు లిక్సిల్ సెరామిక్ కంపెనీలో టీం లీడర్‌గా పని చేస్తూ భీమడోలులో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 1న శివగణేష్ ఇంటి వద్దనే మద్యం తాగుతుండడంతో భార్య లక్ష్మీ ప్రసన్న మద్యం తాగవద్దని, ఆరోగ్యం పాడైవుతుందని మందలించింది. మనస్తాపం చెందిన శివగణేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కొద్ది సేపటి తర్వాత వచ్చి కలుపు మందు తాగానని చెప్పడంతో భార్య లక్ష్మీ ప్రసన్న భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రికి భర్తను తీసుకుని వచ్చింది. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం శివగణేష్‌ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివగణేష్ మృతి చెందాడు. భార్య లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కట్నం వేధింపులపై ఫిర్యాదు
యలమంచిలి: కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రు గ్రామానికి చెందిన చెల్లింకుల వాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం వాణికి 2021 సంవత్సరంలో పాలకొల్లు రూరల్ పంచాయతీ యాళ్లవానిగరువుకు చెందిన పాండురంగప్రసాద్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు పుట్టిన తరువాత ప్రసాద్ కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో వేధింపులను తట్టుకోలేక వాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment