కలెక్టర్‌కు శుభాకాంక్షలు
ఏలూరు(మెట్రో): నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలెక్టర్ కె.వెట్రిసెల్విని బుధవారం కలెక్టరేట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు దంపతులు కలెక్టర్‌ను కలిశారు. జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, ఎం.వి.రమణ, తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. చాలామంది పూల బొకేల బదులు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికారులందరూ గ్రామాన్ని దత్తత తీసుకొని వచ్చే ఏడాది మోడల్ గ్రామాలుగా ప్రకటించేలా చొరవచూపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment