రుణాలు మంజూరు చేయాలి
వైభవంగా సింహాసన ఉత్సవం
జంగారెడ్డిగూడెం: పారిజాత గిరి వేంకటేశ్వరటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం గోదా రంగనాథ ఉత్సవ మూర్తులకు సింహాసన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఏలూరు(మెట్రో): బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం బ్యాంకర్ల సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,901 స్వయం ఉపాధి పథకం యూనిట్ల ఏర్పాటుకు రూ.36.49 కోట్లు మంజూరయ్యాయన్నారు. యూనిట్ వ్యయంలో 50 శాతం బ్యాంకర్లు రుణాలుగా మంజూరు చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీగా అందిస్తుందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.విజయరాజు, జిల్లా పరిషత్ సీఈఓ కె.సుబ్బారావు పాల్గొన్నారు.
బ్రెయిలీ లిపి క్యాలెండర్ ఆవిష్కరణ
అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన క్యాంలెండర్‌ను కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంధులతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి కేక్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment