హైవే పనులు ప్రారంభించనున్న ప్రధాని
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీప్రాంతంలో నూతనంగా మంజూరైన జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణం పనులను నేడు ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఎన్‌హెచ్ అధికారులు జీలుగుమిల్లిలో శిలాఫలకం దిమ్మను మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో నిర్మించిన జాతీయ రహదారులను ప్రారంభించడంతో, శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో మంజూరైన జాతీయ రహదారి 365 బీబీ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఈ రహదారి జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా రెడ్డి గణపవరం, కేఆర్‌పురం, పోలవరం మండలం ఎల్‌ఎన్‌డిపేట మీదుగా పట్టిసీమ వరకూ సుమారు 40.4 కిలోమీటర్లు ఉంటుంది. పట్టిసీమ నుంచి రాజమండ్రి వరకూ కూడా ఈ రహదారి పనులు జరగనున్నాయి. జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి అవసరమైన భూసేకరణకు అధికారులు ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment