శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో మంగళవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 40 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.3,85,61,549 ఆదాయంతో పాటు, కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 383 గ్రాముల బంగారం, 12.008 కేజీల వెండి, అధికంగా విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ ఇన్‌చార్జీ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్ల ద్వారా రూ.29,500 లభించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment