చివరకు కన్నవారి చెంతకు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మార్కులు తక్కువ వచ్చాయని మందలించడంతో అలిగి వచ్చిన ఇద్దరు విద్యార్థులను గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది వారి తల్లిదండ్రులకు అప్పగించారు. యర్నగూడెంకు చెందిన మాసన లక్ష్మీ నరసింహ రాజు, తెలగారెడ్డి నవదీప్‌లు యర్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. వీరికి ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి. ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఇంటికి వెళ్ళగా తండ్రులు సంతకం పెట్టడానికి నిరాకరించారు. బాలురు అలిగి బస్సెక్కి ఏలూరు వచ్చారు. కొత్తబస్టాండులో తిరుగుతున్న వీరిని ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ కిరణ్ గమనించి విషయం తెలుసుకున్నారు. ఆర్టీసీ పీఆర్‌ఓ నరసింహం దృష్టికి విషయం తీసుకువెళ్ళగా ఆయన వారి తండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకుని సమాచారం ఇచ్చారు. బాలుర తండ్రులు ఏలూరు వచ్చిన తరువాత వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment