పాపికొండల విహార యాత్ర మర్చిపోలేం
పాపికొండల విహారయాత్ర మరచిపోలేం. గోదావరి నదిపై ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంతో ఆనందాన్ని పొందాం. పేరంటాలపల్లిలో జలపాతం, కొండరెడ్డి గిరిజనులు తయారు చేసిన వెదురు కళాకృతులు ఎంతో అందంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పాపికొండల విహారయాత్ర చేసి తీరాల్సిందే.
– చెరుకూరి వెంకట రాజయోగి, పర్యాటకుడు, కేఆర్‌పురం
ప్రకృతి అందాలు మనస్సును దోచుకున్నాయి
పాపికొండల విహారహాత్ర అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. గోదావరి నదిపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఇరువైపులా ప్రకృతి అందాలు మనస్సును దోచుకున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసిన యాత్ర మరచిపోలేనిది. పిల్లలు సైతం ఎంతో ఎంజాయ్ చేశారు. సెలవుల్లో ఈ యాత్ర చేయడం ఎంతో మధురానుభూతిని కలిగించింది.
– ఎస్. జీవన్, పర్యాటకుడు, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment