హెల్మెట్‌తో ప్రాణ రక్షణ
అలరించిన నృత్య ప్రదర్శన
భీమవరం (ప్రకాశంచౌక్): మావుళ్లమ్మ ఆలయ వార్షిక మహోత్సవాల్లో భాగంగా కళాంజలి నృత్యనికేతన్ (పాలకొల్లు) కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చిన్న తప్పిదంతో జీవితాన్ని కోల్పోవడం, అంగవైకల్యం పొందడం జరుగుతుందని, వాహనచోదకులతో పాటు సహ ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ హితవు పలికారు. ఏలూరులో న్యాయమూర్తి పురుషోత్తంకుమార్ అధ్యక్షతన హెల్మెట్ ధారణ–ప్రమాదాల నివారణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ హెల్మెట్ ధారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, శనివారం న్యాయశాఖ ఉద్యోగస్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కారులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం పలువురికి హెల్మెట్లు అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి, న్యాయవాదులు ఏలూరు వెంకటేశ్వరరావు, బీఈ సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment