● ముక్తకంఠంతో కోరుతున్న ప్రజలు
● సంచలనం రేపిన ‘సాక్షి’ కథనం
నూజివీడు: ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గతంలో జరిగిన దోపిడీపై, మళ్లీ దోపిడీ చేసేందుకు కొందరు పావులు కదుపుతున్న వైనంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం ఆగిరిపల్లితో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. దేవుడి పేరు చెప్పుకొని చేస్తున్న దోపిడీ గురించి ఉన్నది ఉన్నట్టు ‘సాక్షి’ తెలిపిందని ప్రజలు చర్చించుకోవడం విశేషం. రశీదులు ఇవ్వకుండా చందాలు వసూలు చేయడమేంటని విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రథసప్తమి ఉత్సవాల్లో అన్నదానం నిర్వహణకు సంబంధించి దాతల చందాలకు రశీదులు ఇవ్వకపోవడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్వార్థపరులు స్వామి వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లిలే ప్రవర్తించడం సిగ్గుచేటని అంటున్నారు. రెండేళ్లుగా నూతన కమిటీ మా దిరిగా ఇప్పుడు కూడా నిర్వహించాలని, చందా లకు రశీదులు ఇవ్వాలని, జవాబు దారీతనంతో, పారదర్శకంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment