తాడేపల్లిగూడెం (టీఓసీ): విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చిన విషయంలో కూటమి నేతలు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడంలేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కార్మికులు జీతాలు సరిగా ఇవ్వడం లేదని, 25 వేల మంది కార్మికులకు గాను 10 వేల మందితో ప్లాంట్ నడుస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్‌కు హాలిడే ప్రకటించి, ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంతంగా గనులు కేటాయించాలని డి మాండ్ చేశారు. ప్రధాని మోదీ విశాఖకు వచ్చిన స మయంలో చెప్పిన ప్యాకేజీ ఇప్పుడు కేంద్ర మంత్రు లు ప్రకటించడం వెనుక మతలబు ఏంటో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment