ఎల్లలు దాటి.. ప్రేమతో ఒకటై
వారి మనసులు కలిశాయి. దేశాల సరిహద్దులు చెరిగిపోయాయి. ఆంధ్ర అమ్మాయి, జర్మనీ అబ్బాయిల ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో టి.నరసాపురం మండలం ఏపుగుంట గ్రామంలో నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తూ పెళ్లివైపు అడుగులు వేశారు. ఏపుగుంటకు చెందిన కూనపాము లావణ్య నాలుగేళ్ల క్రితం జర్మనీలోని మెల్లె నగరంలో నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు వెళ్లింది. కోర్సు పూర్తిచేసిన అనంతరం, అక్కడే ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆసుపత్రిలోనే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న జర్మనీకి చెందిన మార్కస్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో వారి ప్రేమను తల్లిదండ్రులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 4న లావణ్య, మార్కస్‌లు ఏపుగుంట చేరుకున్నారు. శనివారం ఆర్‌సీఎం చర్చిలో మత గురువులు, స్థానికుల సమక్షంలో వివాహ నిశ్చితార్ధ వేడుక ఘనంగా నిర్వహించారు.
– టి.నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment