దెందులూరు: మండలంలోని వేగవరంలో శుక్రవారం రాత్రి పెదవేగి మండలం వంగూరు గ్రామానికి చెందిన అడ్డాల కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ వివరాల ప్రకారం.. వెనుక ఉన్న బైక్ కుమార్ బైక్‌ను ఢీకొట్టింది. అతను ఎద్దుల బండిని ఢీ కొట్టి రోడ్డుపై పడ్డాడు. కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంక్రాంతి పండగకు వచ్చి మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment