ఎకై ్సజ్ దాడులు ఆపాలి
తణుకు అర్బన్: గీత కార్మికులపై ఎకై ్సజు అధికారుల దాడులు తక్షణమే ఆపాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహుమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు అమరవీరుల భవనంలో శనివారం నిర్వహించిన కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బెల్టు షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎకై ్సజ్ విభాగం గీత కార్మికులపై దాడులు చేసి అవమానపరుస్తున్నారని ఇకపై ఊరుకోబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో గీతవృత్తిని కాపాడతామని, గీత కార్మికుల కార్పొరేషన్‌కి నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎకై ్సజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై ్క మద్యాన్ని ఏరులై పారించడంతో కల్లు అమ్మకాలు లేక గీత కార్మిక కుటుంబాలు పస్తులు ఉంటున్నారని విమర్శించారు. గీత కార్మికులకు పెన్షన్లు ఆంక్షలు లేకుండా 50 సంవత్సరాలకే ఇవ్వాలని, వడ్డీ లేని రుణాలు మంజూరుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ్యులు కడలి పాండు, బొంతు శ్రీనివాస్, బొక్క చంటి, కాసాని శీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment