ఏలూరు(మెట్రో): జిల్లాలోని ప్రతి మండలం, సచివాలయాలకు లక్ష్యాన్ని కేటాయించడం ద్వారా ఎంఎస్‌ఎంఈ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలన్నారు.గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలని ఐటీడీఏ ఏపీఓను ఆదేశించారు. పీఎంఈజీపీ దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఏలూరులో కార్పేట్, బంగారు నగల తయారీ రెండు ప్రతిపాదిత క్లస్టర్లకు సంబంధించి సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment