శ్రీవారి క్షేత్రం.. భక్తజన సాగరం
శ్రీనివాసా.. గోవిందా.. వేంకటరమణా.. గోవిందా.. స్మరణలు మార్మోగాయి. ద్వారకాతిరుమలలో చినవెంకన్న క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. శనివారం, సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చిన పండుగ చుట్టాలు తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్రంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ఆరుబయటే బారులు తీరారు. తూర్పు రాజగోపుర ప్రాంతంలో భక్తులు పోటెత్తారు. ఉచిత ప్రసాదం కోసం క్యూలు కట్టారు. క్షేత్రంలోని విభాగాలన్నీ కిటకిటలాడాయి. పార్కింగ్ ప్రాంతాలు, ఘాట్ రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. రాత్రి వరకు రద్దీ కొనసాగింది. అనివేటి మండపంలో బాలల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. –ద్వారకాతిరుమల
Comments
Please login to add a commentAdd a comment