భళా.. బాలోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో శనివారం రెండోరోజు హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు ఉత్సాహంగా సాగాయి. అకడమిక్ అంశాల్లో మెమొరీ టెస్ట్, కథ చెప్పడం, మైక్రో ఆర్ట్స్, పేపర్ క్రాఫ్ట్, క్విజ్, ఇంగ్లిష్ రైమ్స్, పద్యాలు, మట్టితో బొమ్మలు, కల్చరల్ అంశాల్లో సందేశాత్మక గీతాల బృంద నృత్యం, హరిశ్చంద్ర, గబ్బిలం పద్యాలాపన, సోలో క్లాసికల్ డాన్స్, సందేశాత్మక గీతాలాపన, లఘు నాటిక, బురక్రథ, హరికథ, జముకుల కథ, కోలాటం బృందంలో ప్రతిభ కనర్చారు. ఏకపాత్రాభినయం పోటీల్లో బాలలు భళా అనిపించారు. డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీపీఓ కొడాలి అనురాధ, సెట్‌వెల్ సీఈఓ ప్రభాకర్, అమరావతి బాలోత్సవం అధ్యక్షుడు టి.కొండలరావు, రాష్ట్ర బాలోత్సవాల సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడారు. బాలోత్సవం ఆహ్వా న సంఘం చైర్‌పర్సన్ అడుసుమిల్లి ని ర్మల, వర్కింగ్ ప్రెసిడెంట్లు వీజీఎంవీఆర్ కృష్ణారావు, ఎంఎస్‌ఎంఎస్ కు మార్, అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment