కవి ప్రసాద్‌కు పురస్కారం
తణుకు అర్బన్: మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయ మండలి నిర్వహించిన కవితల పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన కవి, జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు వీఎస్‌వీ ప్రసాద్‌కు ఉత్తమ పురస్కారం అందజేశారు. ఫత్తేపురంలోని గాంధీ స్మారక భవనంలో గత నెల 30న జరిగిన జిల్లాస్థాయి కవితా రచనల పోటీల్లో మరో క్విట్ ఇండియా ఉద్యమం అనే కవితకు పురస్కారం దక్కినట్లు ప్రసాద్ తెలిపారు.
జాతీయ క్రీడలకు రిఫరీగా సూర్యనారాయణ
తణుకు అర్బన్ : ఉత్తరాఖండ్‌లో నిర్వహించనున్న జాతీయ క్రీడల్లో మోడరన్ పెంటథ్లాన్ (రన్నింగ్, స్విమ్మింగ్) పోటీలకు రిఫరీగా తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ నెల 7 నుంచి 14 వరకు నిర్వహించే ఈ పోటీలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు సూర్యనారాయణ తెలిపారు.
రథసప్తమి వేడుకలకు ముస్తాబు
ద్వారకాతిరుమల: రథసప్తమి వేడుకలకు శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. అందులో భాగంగా శ్రీవారు, అమ్మవార్ల తిరువీధి సేవలకు వినియోగించే సూర్య, చంద్ర ప్రభ వాహనాలను దేవస్థానం సిబ్బంది వాహనశాల నుంచి శనివారం బయటకు తీశారు. వాటిని ఆదివారం శుభ్రం చేయనున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 4న ఉదయం 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు సూర్య ప్రభ వాహనంపై, అలాగే రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై తిరువీధి సేవలను కన్నులపండువగా నిర్వహిస్తామని ఆలయ ఇన్‌చార్జి ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment