శాసీ్త్రయ పద్ధతిలో కోళ్ల ఖననం
భీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన కోళ్లను శాసీ్త్రయ పద్ధతిలో ఖననం చేస్తున్నామని, ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. చనిపోయిన కోళ్లను శాసీ్త్రయ పద్ధతిలో ఖననాన్ని పశు వైద్యులు, సహాయక సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వేల్పూరుకు కిలోమీటర్ దూరంలోని ప్రాంతం అలర్ట్ జోన్‌గా ప్రకటించి అప్రమత్తం చేశామన్నారు. పోలీసు, రెవెన్యూ, అటవీ, పశు సంవర్ధక తదితర శాఖలతో 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గ్రామాలకు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల ప్రాంతంలో కోళ్లు, కోళ్ళ ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేశామన్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఈ వ్యాధి ప్రబలకుండా పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా, మిగిలిన ప్రాంతాలలో ఉడకబెట్టిన గుడ్లు, మాంసాన్ని నిర్భయంగా వినియోగించవచ్చని స్పష్టం చేశారు. రెడ్ జోన్‌లో 2 చెక్‌పోస్టులు, ఆరెంజ్ జోన్‌లో 4 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment