73.71 లక్షల విదేశీ సిగరెట్ స్టిక్స్ ధ్వంసం
ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి
లక్ష్మీపురం(గుంటూరు): స్మగ్లింగ్ కేసుల్లో పట్టుబడిన 73.71 లక్షల విదేశీ సిగరెట్ స్టిక్స్ ధ్వంసం చేసినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌లో సిగరెట్లను కాల్చి బూడిద చేసే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ అధికారులు పట్టుకున్న విదేశీ సిగరెట్లను స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నాశనం చేసినట్లు తెలిపారు. అన్ని అనుమతులతో, పర్యావరణానికి హాని కలగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ధ్వంసం చేసిన వాటిలో పారిస్, డరమ్ బ్లాక్ వంటి వివిధ చౌకబారు బ్రాండ్ సిగరెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ సిగరెట్లు దిగుమతయ్యాయని పేర్కొన్నారు. ఇలాంటి సిగరెట్లను విక్రయించినా, కలిగి ఉన్నా.. భారీ పెనాల్టీలతోపాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. సిగరెట్ల ధ్వంసం కార్యక్రమంలో డీఆర్‌ఐ డి.సి.సాహస సూర్య, కస్టమ్స్ ఏసీ అబ్దుల్ అజీమ్ కస్టమ్స్ సూపరింటెండెంట్లు కిషోర్, వివేక్, వేణుగోపాల్, నందిపాటి శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment