గుంటూరు
గురువారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2024
నిత్యాన్నదానానికి విరాళం
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి తెనాలికి చెందిన బొర్రా రవికుమార్ కుటుంబం బుధవారం రూ. 1.21 లక్షల విరాళం అందజేసింది.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద బుధవారం 4709, హై లెవల్ కాలువకు 153 క్యూసెక్కులు విడుదల చేశారు.
భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన
రాజుపాలెం: గ్రామంలోని జయంతి కాలనీ శ్రీవైష్ణవ హరిదాసుల సంఘం ఆధ్వర్యంలో మంగళ కై శిక ద్వాదశి నగర సంకీర్తన బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మిర్చి సీజన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): త్వరలో ప్రారంభం కానున్న మిర్చి సీజన్ నాటికి యార్డులో పెండింగ్ పనులు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్, యార్డు పర్సన్ ఇన్‌చార్జి ఎ.భార్గవ్ తేజ సూచించారు. రాబోవు సీజన్‌కు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మిర్చి దిగుమతి వ్యాపారులు, యార్డు అధికారులు, వేమెన్స్‌తో బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. మిర్చి రైతులు, హమాలీలు, వ్యాపారులకు ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు ఏ రోజు తెచ్చిన మిర్చి బస్తాలు ఆరోజే అమ్ముకొని వెళ్ళేలా చూడాలని, రైతులకు పేమెంట్ కూడా ఆరోజే చేయాలని ఆదేశించారు. కమీషన్ షాపుల వారు యార్డులో రెడ్ గీత దాటి మిర్చి బస్తాలు వేయరాదన్నారు. జీరో వ్యాపారం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తూకాల్లో మోసాలు జరగకుండా స్టాంపింగ్ వేసిన వేయింగ్ మిషన్లనే వినియోగించేలా చూడాలన్నారు. యార్డు లోపలికి వచ్చే ప్రతి మిర్చి బస్తాను ఎంట్రీ చేయాలన్నారు. ఎగుమతి వ్యాపారులతో బిడ్డింగ్ వేయించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని వివరించారు. సమావేశంలో యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు, అధికారులు సుబ్రమణ్యం, శ్రీకాంత్, దిగుమతి వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు లేళ్ల పెద అప్పిరెడ్డి, కుర్రి సాంబిరెడ్డి, కొత్తూరి సుధాకర్, నరేంద్ర, పలువురు అసోసియేషన్ నాయకులు, వేమెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఆమె ప్రతిభ ఎట్టిది ‘అనఘా’
గణిత ఘనాపాఠి
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరానికి చెందిన చిర్రా అనఘాలక్ష్మి అద్భుత మేధా శక్తితో రాణిస్తోంది. 13 ఏళ్ల వయసులోనే సీనియర్ ఇంటర్ చదువుతోంది. ఆరో తరగతి చదువుతున్నప్పుడే ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు సత్యదేవి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దీంతో 2023 మార్చిలో అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యేక అనుమతితో ఏకంగా టెన్త్ పరీక్షలు రాసి 600 మార్కులకు 566 సాధించింది. గత జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు 454 సాధించింది. 10 ఏళ్ల వయసులోనే గణితంలో శతావధానం చేసి రికార్డు సృష్టించింది. అబాకస్, వేదగణితంలోనూ సత్తాచాటుతోంది. చిన్నారి ప్రతిభను చూసి అందరూ ముగ్ధులవుతున్నారు.
పతకాలతో ‘షేక్’హ్యాండ్
తైక్వాండో చిచ్చరపిడుగు
తెనాలి: మార్షల్ ఆర్ట్స్ తైక్వాండోలో రాణిస్తోందీ చిన్నారి షేక్ సనాఫాతిమా. స్థానిక నెహ్రూనికేతన్‌లో ఆరోతరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ముజాహిదా సుల్తానా, ఆరిఫ్‌ల ప్రోత్సాహంతో కోచ్ శ్రీనివాసరావు శిక్షణలో తైక్వాండోలో రెండేళ్లుగా సాధన చేస్తోంది. పలు పోటీల్లో పాల్గొని ఎల్లో, ఎల్లోవన్, గ్రీన్, గ్రీన్‌వన్ బెల్ట్‌లను సాధించింది. రేపల్లెలో జరిగిన తొలి జాతీయ ట్రెడిషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్–2023లో అండర్–12 బాలికల విభాగంలో రజత పతకాన్ని సాధించింది. గత జూలైలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ జూనియర్స్ విభాగంలో కాంస్యం గెలిచింది. గత నెలలో తెనాలిలో జరిగిన నాలుగో రాష్ట్రస్థాయ తైక్వాండోలోనూ కాంస్య పతకాన్ని సాధించింది. ఇటీవల స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లోనూ కాంస్యంతో విజయహాసం చేసింది. ఆత్మరక్షణ విద్య నేర్పించాలనే భావనతో తమ బిడ్డకు తైక్వాండో నేర్పిస్తున్నామనీ, పోటీల్లో పతకాలు కూడా గెల్చుకోవటం సంతోషంగా ఉందని ఆరిఫ్ అన్నారు.
7
న్యూస్‌రీల్
‘మెమరబుల్’ ట్యాలెంట్
‘పవర్’ఫుల్ తనుశ్రీ
అద్భుత ప్రతిభతో అందరినీ అబ్బురపరుస్తున్నారు పలువురు బాలలు. అపార మేధాశక్తితో ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. కండ, బుద్ధి బలాలతో పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా కొందరు చిచ్చరపిడుగులు సాధించిన అద్వితీయ విజయాలు ఇవీ..
పతకాల ‘బంగారం’
లిటిల్ చాంప్స్
వివిధ రంగాల్లో రాణిస్తున్న బాలలు
అద్భుత ప్రతిభతో కీర్తిప్రఖ్యాతులు
సత్తాచాటుతున్న గుంటూరు జిల్లా
చిచ్చరపిడుగులు
తెనాలి: తెనాలి మండలం గుడివాడకు చెందిన చిన్నారి బండికళ్ల ప్రదీప్ నారాయణ్ అద్వితీయ జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తున్నాడు. 11వ నెల వయసు నుంచే జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, మానవ శరీర భాగాలు, గృహోపకరణాలతో సహా మొత్తం 150 పేర్లను గుర్తిస్తూ, 11 నిముషాల్లోనే వాటిని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ బుడతడి వయసు మూడేళ్లు. భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ గుర్తింపును పొందిన బెంగళూరు వెయిల్ ఫౌండేషన్ ప్రదానం చేసిన ఇండోస్పానిష్ ఇంటర్నేషనల్ అవార్డు–2024తో సహా తొమ్మిది ప్రపంచ రికార్డులను, మూడు జాతీయ రికార్డులను అందుకున్నాడు. ఇప్పుడు జాతీయగీతం ‘జనగణమన’ను 52 సెకన్లలో పాడుతున్నాడు. ఈ ప్రదర్శనకు అమూల్ భగత్ మీడియా చైల్డ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ మోటివేషనల్ అవార్డును గత జూలై 29న ముంబయిలో ప్రదానం చేసింది. అంతకుముందు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ నుంచి ధ్రువీకరణ పొందిన పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఫ్లాంక్‌టన్ ఎంటర్‌ప్రైజెస్ నేషనల్ ప్రెస్టీజ్ అవార్డు–2024నూ ప్రదీప్ అందుకున్నాడు. ప్రదీప్ నారాయణ్ తల్లిదండ్రులు బండికళ్ల రాజేష్, గుణప్రియ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. పసివయసులో బిడ్డలోని జ్ఞాపకశక్తిని గుర్తించి, తగిన విధంగా తర్ఫీదు ఇచ్చినట్టు తండ్రి రాజేష్ వెల్లడించారు.
మూడేళ్ల బుడతడి అద్భుతం
తెనాలి: స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూలు విద్యార్థిని డి.తనుశ్రీ పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుత ప్రతిభ చాటుతోంది. తొమ్మిదో తరగతి చదువుతున్న తనుశ్రీ, రెండు నెలల క్రితం పవర్‌లిఫ్టింగ్ సాధన ఆరంభించింది. స్థానిక స్టేడియంలోని కోచ్ గోపీ శిక్షణలో పట్టుదలతో సాధన చేసింది. ఈనెల 8 నుంచి 10 వరకు భీమవరంలో జరిగిన అమరావతి పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తనుశ్రీ పాల్గొంది. 84 ప్లస్ కేటగిరీలో స్క్వాట్జ్ 55 కిలోలు, బెంచ్‌ప్రెస్ 25 కిలోలు, డెడ్‌లిఫ్ట్ 85 కిలోల చొప్పున మొత్తం 165 కిలోల బరువులనెత్తి మూడు బంగారు పతకాలను గెలుచుకుని మోతమోగించింది. అందరి అభినందనలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment