ఎకై ్సజ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
మంగళగిరి: నగర పరిధిలోని ఎకై ్సజ్ స్టేషన్‌ను బుధవారం డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ రాహుల్ దేవ్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత రాహుల్ దేవ్ శర్మకు సీఐ వీరాంజనేయులు, ఎస్‌ఐలు, సిబ్బంది స్వాగతం పలికారు.
సినీ నటుడు పోసానిపై ఫిర్యాదు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో తెలుగు యువత నాయకుడు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణప్రసాద్ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పై చేసిన వ్యాఖ్యల పట్ల అనేక మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, పోసాని కృష్ణ మురళీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆచార్య గంగప్ప సాహితీ పరిశోధనలు గర్వకారణం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆచార్య గంగప్ప సాహితీ పరిశోధనలు గర్వకారణమని కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవీ నారాయణ అన్నారు. బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో ‘ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం– 2024‘ ప్రముఖ సాహిత్యవేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరీదేవికి అందజేసి, నగదు పురస్కారంతో సత్కరించారు. సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కార్యక్ర మంలో ఆలయ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, ఆచార్య జీవీ చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు, డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, సాహితివేత్తలు, ఆచార్య గంగప్ప కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇసుక లారీ సీజ్
తాడికొండ: అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు తుళ్లూరు ఎస్‌ఐ కొండలు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహిస్తుండగా వెలగపూడి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడుతో వస్తున్న లారీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
శబరిమల యాత్రకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): అయ్యప్ప స్వాముల శబరిమల యాత్రకు, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామాలకు వెళ్లే వారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఎం. రవికాంత్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌లో స్పెషల్ బస్సుల కరపత్రాలను ఆవిష్కరించారు. శబరిమల వెళ్లే సమయంలో బస్సు సర్వీసు కాణిపాకం, భవానీ, ఎరిమేలి, పంబా మీదుగా వెళ్లి వచ్చేటప్పుడు కుర్తాళం, మధురై, చైన్నె, మేల్‌మరవత్తూరు మీదుగా గుంటూరు చేరుకుంటుందన్నారు. ఒకేరోజులో పంచారామాలు, త్రి శైవక్షేత్రాలు దర్శించుకునేందుకు ప్రత్యేక బస్సులు వేసినట్టు వెల్లడించారు. బస్సులు ప్రతి శని, ఆదివారం రాత్రి 9 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment