పోలీసులు రౌడీయిజం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పోలీసులు రౌడీయిజం చేస్తున్నారు

Published Thu, Nov 14 2024 9:11 AM | Last Updated on Thu, Nov 14 2024 9:11 AM

పోలీసులు రౌడీయిజం చేస్తున్నారు

పోలీసులు రౌడీయిజం చేస్తున్నారు

లక్ష్మీపురం (గుంటూరు ఈస్ట్‌) : రాష్ట్రంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటూ రౌడీయిజం చేస్తున్నారని, ఇలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని రానున్న రోజుల్లో చట్టం ముందు నిలబెడతామని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు గ్రామానికి చెందిన పొలూరి రాజశేఖర్‌రెడ్డిని మంగళవారం జిల్లా జైలు ముందు మీడియా సమక్షంలో తాను హాజరుపర్చి రాజశేఖర్‌రెడ్డి తన వద్దే ఉన్నాడని పోలీసులకు చెప్పి బుధవారం ఉదయం 10.30 గంటలకు నూజీవీడు పోలీసులకు అప్పజెప్పాను. ఇక గురువారం 10.30 గంటలకల్లా ఆయనను కోర్టులో హాజరుపర్చాలి. రాజశేఖర్‌రెడ్డిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే సహించేదిలేదు. ఎక్కడైనా కొట్టినట్లు తెలిస్తే వారి సంగతి ఖచ్చితంగా తేలుస్తాం. కోర్టులో ప్రైవేట్‌ కేసు వేస్తాం. నాలుగు రోజులుగా నూజివీడు పోలీసులు రాజశేఖర్‌రెడ్డికి ఫోన్లు చేశారు. ఆయన అన్నకు ఫోన్లుచేసి వేధిస్తూ బెదిరించారు. ఇక మా మీద పోస్ట్‌ పెట్టిన సంగతి ఏంటి? నా భార్య, నా పిల్లలపై దారుణంగా, అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే పోలీసులకు సంతోషంగా ఉందా? మాతో పాటు మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణీ, వైఎస్సార్‌ సీపీ నేతలపైనా పెట్టిన పోస్టుల సంగతి ఏమిటి? ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు మేం ఫిర్యాదు చేశాం. కానీ ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోలేదు. ఈ పోస్టింగులు వెనుక నారా లోకేశ్‌ ఉన్నారు. అందరూ సమానమంటున్న చంద్రబాబు మా సోషల్‌ మీడియాను తొక్కేసి, టీడీపీ సోషల్‌ మీడియాను హైప్‌ చేయాలని చూస్తున్నారు. టీడీపీ పెడుతున్న ఒక్క కేసు కూడా న్యాయస్థానాల్లో నిలబడదు. సోషల్‌ మీడియా కార్యకర్తలకు తీవ్రవాదులు, దేశద్రోహులు మాదిరిగా ముసుగులు వేసి అరెస్టులు చూపిస్తున్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబు స్క్రిప్ట్‌ చదువుతున్నారు. బాబు స్క్రిప్ట్‌ చదవాల్సింది పవన్‌ కాదు లోకేశ్‌. పవన్‌కళ్యాణ్‌ తన సొంత బుర్రను ఉపయోగించాలి.’’ అని అంబటి పేర్కొన్నారు.

రాజశేఖర్‌రెడ్డిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే

సహించేదిలేదు

మాజీమంత్రి అంబటి రాంబాబు

హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement