అవార్డులతో బాధ్యత మరింత పెరగాలి
డీఈఓ రేణుక
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పేర్కొన్నారు. ఈనెల 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నుంచి ఉర్దూ విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న వారిని బుధవారం డీఈఓ తన కార్యాలయంలో అభినందించారు. ఉర్దూకు మంచి భవిష్యత్తు ఉందని, ఉర్దూ నేర్చుకోవడం ద్వారా అనేక రంగాల్లో రాణించవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా పురస్కారాలు పొందిన అహ్మదున్నీసా (ఎంపీపీ స్కూల్, నులకపేట, తాడేపల్లి), ఆర్.నాగమణి (నగరపాలకసంస్థ పాఠశాల, అహ్మద్‌నగర్, గుంటూరు), షేక్ రిజ్వానా బేగం (నగరపాలకసంస్థ పాఠశాల, సంగడిగుంట, గుంటూరు) ను అభినందించారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్, మైనార్టీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు సయ్యద్ ఇసాక్, జిలానీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment