భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు
గుంటూరు రూరల్: కార్తిక మాసం పురస్కరించుకుని మండలంలోని గోరంట్ల గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం(పెద్దగుడి)లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలను నిర్వహించారు. స్వామివారికి వజ్రకిరీటంతో, బంగారు ఆభరణాలు అలంకరించి ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో సుమారు 6 వేల మంది దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వత్రం నిర్వహించారు. అన్నవరం ఆలయం వేదపండితులు, అర్చకులతో వేలాది మంది దంపతులు పీటలపై కూర్చుని ఉసిరిచెట్టు నీడల్లో సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసీ ధర్మచరణ్, డేగల ప్రభాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment