అ‘పూర్వం’.. ఆత్మీయం
మంగళగిరి: నగర పరిధిలోని నూతక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు దశాబ్దాల తర్వాత స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు. జడ్పీ హైస్కూల్లో 1993–94 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఒక్కచోట కలుసుకుని సందడి చేశారు. మూడు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో తమ పాఠశాల నాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకుని, అప్పుడప్పుడు టచ్‌లో ఉండాలంటూ తీర్మానం చేసుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా రోజంతా గడిపారు. కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరావులకు స్నేహితులంతా అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథులుగా గణితం మాష్టారు భీమిరెడ్డి శివారెడ్డి, జొన్నల ప్రసాదరెడ్డిలు హాజరయ్యారు. విద్యార్థుల పాత చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నిమ్మగడ్డ సతీష్‌కు అభినందనలు తెలిపారు.
నూతక్కి జడ్పీ హైస్కూల్లో
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
31 సంవత్సరాల తర్వాత
కలుసుకున్న మిత్రులు
Comments
Please login to add a commentAdd a comment