పల్నాటి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. నాగులేరు నీటిని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న ఎడ్ల పందేల నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు. మొదట వీరుల గుడిలోని పల్నాటి వీరుల ఆయుధాలను తిలకించారు. పల్నాటి వీరాచార పీఠం నిర్వాహకుడు పిడుగు తరుణ్ చెన్నకేశవ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పల్నాటి చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో
వైద్యుడు మృతి
పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని సూర్యసెమ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన సౌజన్య హాస్పటల్ డాక్టర్ కృష్ణంశెట్టి శ్రీధర్ దాచేపల్లి పట్టణంలో ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిర్వహించి తిరిగి పిడుగురాళ్ల వస్తున్నారు. సూర్యసెమ్ వద్దకు రాగానే లారీ బయటకురావటంతో వెనుక నుంచి దానిని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ పోలీసులు పరీశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment