ముగిసిన జేఎన్‌టీయూకే కబడ్డీ పోటీలు
ఒంగోలు: జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న సెంట్రల్ జోన్ అంతర కళాశాలల మహిళా కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో గుడ్లవల్లేరు ఎస్‌ఆర్‌జీఈసీ కాలేజీ – గుంటూరు సెయింట్ మేరీస్ జట్లు తలపడగా, ఉత్కంఠ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో గుడ్లవల్లేరు కాలేజీ టీం విజేతగా నిలిచింది. గుంటూరు సెయింట్ మేరీస్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ కాలేజీల కార్యదర్శి శిద్దా హనుమంతరావు, కోశాధికారి శిద్దా భరత్, రాగ చీఫ్ కో–ఆర్డినేటర్ శిద్దా ప్రవల్లిక, గౌరవ చైర్మన్ ఇస్కాల చినరంగమన్నార్, డైరెక్టర్ ఏవీ భాస్కరరావులు ట్రోఫీలు అందించారు. అనంతరం యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న యూనివర్సిటీ జట్టు ఈ నెల 26 నుంచి 30వ తేదీవరకు కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఆడుతుందని ఫిజికల్ డైరెక్టర్ హేమచంద్ర తెలిపారు.
యూనివర్సిటీ జట్టు...
కోట అనంత (గుడ్లవల్లేరు–ఎస్‌ఆర్‌జీఈఎస్), కె.కీర్తన (గుంటూరు సెయింట్ మేరీస్), దదివి సుశ్మిత (రైజ్ కృష్ణసాయి గాంధీ–ఒంగోలు), ఆర్.లక్ష్మి (ఎంఎల్‌సీ మహిళా కాలేజీ–గుంటూరు), పి.అంజనీదేవి (రైజ్ కృష్ణసాయి ప్రకాశం–ఒంగోలు), బి.భార్గవి (శ్రీవాసవీ ఇంజినీరింగ్ కాలేజీ–తాడేపల్లిగూడెం), కె.జ్యోతిశ్రీ (యూనివర్సిటీ కాలేజీ–కాకినాడ), పి.సుశ్మిత(కిట్స్–రామచంద్రాపురం), పి.చందన (ఈశ్వర్ కాలేజీ–నరసరావుపేట), ఐ.శ్రీలక్ష్మి (విజ్ఞాన్ నిరుల– గుంటూరు), డి.కావేరి(పేస్ – ఒంగోలు), ఎన్.సత్యదుర్గాఐశ్వర్య (ఐడియల్ కాలేజీ–కాకినాడ).
గుంటూరు సెయింట్ మేరీస్‌కు
ద్వితీయస్థానం
Comments
Please login to add a commentAdd a comment