మహిళా న్యాయవాది బలవన్మరణం
తెనాలిరూరల్: మహిళా న్యాయవాది బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తెనాలి పట్టణం శివాజీచౌక్ సమీపంలో నివసించే కాకుమాను కిరణ్మయి(40) జడ్జి పరీక్షలు రాసినా క్వాలిఫై కాలేదు. దీనికి తోడు కొన్ని అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు, బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి అప్పగించగా అంత్యక్రియలు జరిపించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
108లో పండంటి బిడ్డకు జననం
తాడేపల్లిరూరల్: దుగ్గిరాల మండల పరిధిలోని పెనుమూలి గ్రామంలో 108 అంబులెన్స్‌లో ఓ మహిళ పండంటి శిశువుకు ఆదివారం తెల్లవారుజామున జన్మనిచ్చింది. 108 పైలెట్ ప్రసాద్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం పెనుమూలి గ్రామానికి చెందిన నాగదుర్గకు పురిటి నొప్పులు వచ్చాయని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారని, ఆమె నివాసానికి వెళ్లి 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువకావడంతో కాన్పు చేశామన్నారు. నాగదుర్గ మగబిడ్డ పుట్టాడని, పేగు మెడలో వేసుకుని జన్మించడంతో మెరుగైన వైద్య నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. కాన్పు నిర్వహించిన వారిలో ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఆనంద్, ఆశా కార్యకర్త ఫాతిమాలు ఉన్నారు.
కాలువలో పసికందు
మృతదేహం
గుంటూరు రూరల్: అప్పుడే పుట్టిన బిడ్డను కాలువలో పడేసిన సంఘటన మండలంలో కలకలం రేపింది. నగర శివారులోని గుంటూరు–పొన్నూరు రహదారి బుడంపాడు కాలువ కల్వర్టు దగ్గరలో రోజుల వ్యవధిగల మగశిశువు మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని రుద్రట్రస్ట్ సభ్యుల సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘఽటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి శిశువు మృతదేహం నీటిలో కొట్టుకువచ్చిందా? లేక ఎవరైనా తెచ్చి ఇక్కడ పడవేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment