ఆవిష్కరణల దిశగా విద్యార్థులు సాగాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు నూతన ఆవిష్కరణల దిశగా ముందుగా సాగాలని, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా రాణించాలని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ కేపీ చౌదరి పేర్కొన్నారు. ఏఎం రెడ్డి ఫార్మసీ కళాశాలలో ఇన్నోవేషన్, ఎంటర్‌స్పైడ్ అనే అంశంపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేపీ చౌదరి మాట్లాడుతూ.. యువత ఎంఎస్‌ఎంఈ ద్వారా నూతన పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. విధివిధానాలు, కల్పించే అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి.భార్గవ్‌భూషణ్‌రావు, డీన్ డాక్టర్ ఎంఎల్ సురేఖ, కార్యక్రమ కోఆర్డినేటర్లు సీహెచ్ అజయ్‌కుమార్, డాక్టర్ డి.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment