గుంటూరు వెస్ట్: స్పెషల్ సమ్మరీ రివిజన్–2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల సంఖ్య 17,96,356 ఉన్నారన్నారు. వీరిలో పురుషులు 8,66,871, సీ్త్రలు 9,27,601 ఉన్నారని పేర్కొన్నారు. సర్వీస్ ఓటర్లు 1,723, ట్రాన్స్‌జెండర్స్ 161 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ తర్వాత 1920 ఉన్నాయని చెప్పారు. ఓటర్ల ప్రక్రియ నిరంతర ప్రక్రియన్నారు. అర్హులైన ఓటర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నమోదు చేసుకోవాలని తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదులో తప్పులు దొర్లినట్లు భావిస్తే సవరణ చేసుకోవచ్చన్నారు. ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన వెంటనే సవరణ ప్రక్రియ చేపడతామన్నారు. ఎస్‌ఎస్‌ఆర్–2025 తుది జాబితా డిజిటల్ ప్రింట్ కాపీలను పెన్ డ్రైవ్‌లను, ప్రింట్‌లను ప్రజాప్రతినిధులకు అందజేశారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సామాజిక బాధ్యత
ప్రభుత్వ ఉద్యోగమంటే కేవలం ఉపాధి మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి ఆమె 11 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులనందించారు.
జిల్లాలో ఓటర్ల సంఖ్య 17,96,356 పురుషులు 8,66,871, సీ్త్రలు 9,27,601
Comments
Please login to add a commentAdd a comment