గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Published Tue, Jan 7 2025 2:05 AM | Last Updated on Tue, Jan 7 2025 2:05 AM

గుంటూ

గుంటూరు

మంగళవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2025

కొరిటెపాడు(గుంటూరు): రైతులపై పైసా భారం పడకూడదన్న ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు మంగళం పాడింది. ప్రీమియం రైతులే చెల్లించాలన్న నిబంధన విధించింది. దీంతో కర్షకులు ఈ బీమా మాకొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రావడం లేదు.

రబీలో ఐదు పంటలకే బీమా !

పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఈ రబీలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, శనగ పంటలకు బీమా వర్తింపజేశారు. ఇందులో జొన్న, పెసర, మినుము, శనగ పంటలకు రైతులు తమ వాటా కింద హెక్టారుకు 0.25 శాతం, మొక్కజొన్నకు 0.30 శాతం మేర ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. హెక్టారుకు జొన్న రైతులు రూ.140, మొక్కజొన్న రైతులు రూ.119, పెసర రైతులు రూ.285, మినుము రైతులు రూ.113, శనగ రైతులు రూ.125 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సిందేనని నిబంధన విధించారు. ఈ ఐదు పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు డిసెంబర్‌ 15గా నిర్ణయించారు. అయితే 683 మంది మాత్రమే బీమా పథకాల్లో చేరడంతో డిసెంబర్‌ నెలాఖరు వరకు గడువు పొడిగించారు. అయినా ఈ 15 రోజుల్లో మరో 1,156 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించడం గమనార్హం. మొత్తంగా 29,756 హెక్టార్లకు ప్రీమియం చెల్లిస్తారని అధికారికంగా అంచనా వేయగా.. చివరకు 1,849.32 హెక్టార్లకు మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు చెబుతున్నారు. అంటే చాలా మంది రైతులు పంటల బీమా పథకాల్లో చేరడానికి, ప్రీమియం కట్టడానికి ఆసక్తి కనపరచలేదు. 1,839 మంది రైతులు, 1,849.32 హెక్టార్లకు కట్టిన ప్రీమియం రూ.3.59 లక్షలుగా ఉంది.

గత ఐదేళ్లూ నిశ్చితంగా..

గత ఐదేళ్లూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఖరీఫ్‌, రబీలో ఉచితంగా వాతావరణ, ఫసల్‌ బీమా పథకాలు అమలు చేసింది. రైతులపై పైసా కూడా భారం లేకుండా పరిహారం అందజేసింది. ఈ–క్రాప్‌, ఈ–కేవైసీ చేయించుకుంటే చాలు పథకాలు దరిచేర్చింది. నిబంధనల మేరకు బీమా ద్వారా ఏటా జూన్‌, జూలైలోనే పరిహారం కూడా జమ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఉద్యాన పంటల రైతులకు కూడా పెద్ద మొత్తంలో పరిహారం ఇచ్చారు. గత ఐదేళ్లూ విస్తారంగా వర్షాలు కురిశాయి. పంట దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. ఉచిత పంటల బీమా పథకాల ద్వారా గుంటూరు జిల్లాలో 79,469 మంది రైతులకు ఏకంగా రూ.68.47 కోట్ల నష్టపరిహారం అందించారు.

7

న్యూస్‌రీల్‌

ఉచిత బీమాకు బాబు సర్కార్‌ మంగళం ప్రీమియం చెల్లించాలని నిబంధన మాకొద్దంటున్న రైతులు గడువు పొడిగించినా స్పందన కరువు

ఇదెక్కడి న్యాయం?

ఏడు ఎకరాల్లో మొక్కజొన్న, పెసర పంటలు సాగు చేశా. ఇప్పటికే పంటలు పండక, ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోతున్నాం. ఇలాంటి తరుణంలోనూ బీమా ప్రీమియం భారం మోపడం తగదు. వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం రైతులతో కట్టిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమో అర్ధం కావడం లేదు.

– టి.వెంకటస్వామిరెడ్డి, రైతు, గుంటూరు

నమ్మకం లేక కట్టలేదు

నాకు నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతం పప్పుశనగ పంట సాగు చేశా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులే బీమా ప్రీమియం చెల్లించుకోవాలని చెబుతున్నారు. ప్రీమియం చెల్లించినా బీమా వర్తిస్తుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రీమియం డబ్బు కట్టలేదు. గత ఐదేళ్లూ రైతుల ఇంటి వద్దకే అన్ని పథకాలు అందాయి.

– కె.వెంకటేశ్వరరావు, రైతు, గుంటూరు

జిల్లాలో బీమా వర్తించే పంటల రబీ విస్తీర్ణం, ప్రీమియం చెల్లించిన రైతులు ఇలా..

పంటల సాగు : 29,756 హెక్టార్లు

బీమా ప్రీమియం చెల్లింపు : 1,849.32 హెక్టార్లు

రైతులపై మోపిన భారం : రూ.3.59 లక్షలు..

కర్షకుల కన్నెర్ర..

కూటమి ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోకుండా బీమా ప్రీమియం భారం మోపడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును నమ్మి దారణంగా మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌, రబీలలో ప్రీమియం రూపంలో జిల్లా రైతులపై ఏటా రూ.10 కోట్ల వరకు భారం పడనుందని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత పంటల బీమా అమలు చేయడంతో చీకూచింతలేకుండా పోయిందని గుర్తు చేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరు1
1/8

గుంటూరు

గుంటూరు2
2/8

గుంటూరు

గుంటూరు3
3/8

గుంటూరు

గుంటూరు4
4/8

గుంటూరు

గుంటూరు5
5/8

గుంటూరు

గుంటూరు6
6/8

గుంటూరు

గుంటూరు7
7/8

గుంటూరు

గుంటూరు8
8/8

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement